top of page

Contents

02.

శ్లోకాలు Slokas

03.

పుస్తకాలు Books

04.

ప్రవచనాలు Pravachanalu

This page Under Construction

This page Under Construction

This page Under Construction

పూర్వము ప్రతి గ్రామములో, పట్టణములో, దేవాలయములో ఒక గ్రంధాలయము ఉండేది. కానీ నేటి కాలములో గ్రంధాలయాల సంఖ్య చాలా తగ్గిపోయాయి. అంతే కాక గ్రంధాలయాలకు వెళ్ళి స్వాధ్యాయము చేసే ఆసక్తి ఉన్న జనాలు కూడా తగ్గిపోయారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ గ్రంధాలయ వ్యవస్థ మారకపోవడం చాలా శోచనీయము. గ్రంధాలయాలు కనుమరుగు అవ్వడము వలన నేటి విధ్యార్ధులలో చదవడం పైన ఆసక్తి కూడా తగ్గిపోయింది. అలానే నేటి పిల్లలకు సనాతన ధర్మము యొక్క విశిస్టత తెలియక పాశాండ మతాల మరియు నాస్తికుల భావజాలమునకు ఆకర్షితులవుతున్నారు.

కావున ఈ గ్రంధాలయ వ్యవస్థ ను పునరుద్ధరించి, వాటిని డిజిటల్ మరియు ప్రత్యక్ష రూపములో అందరికీ అందుబాటులో ఉండే విధముగా కృషి చేసి నేటి తరం పిల్లలకు సనాతన ధర్మం యొక్క విషయాలను తెలుపుతూ మన హైందవ సంస్కృతి వృద్ధి కి కృషి చేయడమే ఈ  CRKR Library యొక్క లక్ష్యము

WhatsApp Image 2024-04-11 at 10.20.48 AM.jpeg

కీశే|| చకిలం రామకృష్ణ  రావు గారి వ్యక్తిత్వము ఎంతో ఉన్నతమైనది. వారు ఒక పరిపూర్ణమైన జీవితాన్ని గడిపిన వ్యక్తి.
ఒక మనిషి తన జీవితములో ఆధ్యాత్మిక శిఖరాలను అధిరోహించాలి అంటే దానికి స్వాధ్యాయము, నిత్య పూజ మరియు పుణ్య క్షేత్ర దర్శనాల ద్వారా నే సాధ్యము అని బలము గా నమ్మిన వ్యక్తి రామ కృష్ణా రావు గారు. 
వారు నమ్మాడమే కాకుండా, ప్రతిరోజూ సంధ్యావందనము, నిత్య పూజ ఆచరించి, కొన్ని వందల పుస్తకాలు చదివి, ఆసేతు హిమాచలం అన్నీ పుణ్య క్షేత్రాలు తిరిగి ముందు తరాల వారికి ఒక ఆదర్షముగా నిలిచారు.
వారి యొక్క జీవన విధానమే ఈ CRKR Library కీ స్పూర్తి.

bottom of page